PM Modi: తన ముస్లిం దోస్త్ అబ్బాస్ ను గుర్తు చేసుకున్న ప్రధాని మోదీ

Meet Abbas the childhood friend PM Modi mentioned in his blog

  • చదువుకునే రోజుల్లో మోదీ ఇంట్లో అబ్బాస్ కు ఆశ్రయం
  • తండ్రి అకాల మరణంతో ఆదుకున్న మోదీ తండ్రి
  • అమ్మ అందరి పిల్లలతో సమానంగా అబ్బాస్ ను చూసిందన్న మోదీ

ప్రధాని మోదీని ముస్లిం వ్యతిరేకిగా కొందరు చూస్తుంటారు. కానీ, ఆయనకు ముస్లిం అయిన ఓ చిన్ననాటి స్నేహితుడు ఉన్నాడని ఎవ్వరికీ తెలియదు. ఈ విషయాన్ని తన తల్లి హీరాబెన్ 100వ జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ బ్లాగు పోస్ట్ లో ప్రస్తావించారు.

ఆయన పేరు అబ్బాస్. కానీ, ఆయన ఇప్పుడు భారత్ లో లేరు. ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. గుజరాత్ ప్రభుత్వం ఆహార పంపిణీ శాఖలో క్లాస్ 2 ఉద్యోగిగా పనిచేశారు. ఇటీవలే ఆయన సర్వీసు నుంచి రిటైర్ అయ్యారు. అబ్బాస్ కు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు గుజరాత్ లోని మెహ్సానా జిల్లాలో నివసిస్తున్నారు. చిన్న కుమారుడు ఆస్ట్రేలియాలో స్థిరపడగా.. రిటైర్మెంట్ తర్వాత అబ్బాస్ అక్కడికి వెళ్లారు. 

తన చిన్ననాటి స్నేహితుడు అబ్బాస్ గురించి ప్రధాని ప్రస్తావిస్తూ.. ‘‘మా ఇంటికి సమీపంలోని గ్రామంలోనే మా నాన్న సన్నిహిత మిత్రుడు ఉండేవారు. ఆయన అకాల మరణం చెందడంతో, ఆయన కుమారుడ్ని మా నాన్న మా ఇంటికి తీసుకొచ్చారు. చదువు పూర్తయ్యే వరకు మన దగ్గరే ఉంటారని చెప్పారు. అందరి పిల్లల్లాగే అబ్బాస్ ను కూడా మా అమ్మ చూసేది. ఈద్ రోజున ప్రత్యేక వంటకాలు చేసి పెట్టేది’’అని ప్రధాని మోదీ వివరించారు.

  • Loading...

More Telugu News