Karan Johar: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్టులో బాలీవుడ్ ఫిలింమేకర్ కరణ్ జొహార్!

Lawrence Bishnoi gang had target Bollywood film maker Karan Johar
  • ఇటీవల పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య
  • సూత్రధారి లారెన్స్ బిష్ణోయ్ అంటున్న పోలీసులు
  • పలు ప్రాంతాల్లో బిష్ణోయ్ ముఠా సభ్యుల అరెస్ట్
  • పోలీసుల అదుపులో సిద్ధేశ్ కాంబ్లే
ఇటీవల పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకు కరడుగట్టిన గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సూత్రధారి అని పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. తీహార్ జైల్లో ఉన్న అతడిని పలు దఫాలుగా విచారించారు. మూసేవాలా హత్యకు సంబంధించి ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడు సిద్ధేశ్ కాంబ్లే అలియాస్ మహాకాల్ కూడా ఉన్నాడు. పోలీసులు అతడిని విచారించగా, మరో ఆసక్తికర విషయం వెల్లడైంది. 

బాలీవుడ్ ఫిలింమేకర్ కరణ్ జొహార్ కూడా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హిట్ లిస్టులో ఉన్నాడట. కరణ్ ను బెదిరించి డబ్బు గుంజాలన్నది తమ ప్రయత్నమని సిద్ధేశ్ కాంబ్లే వెల్లడించాడు. చంపేస్తామని బెదిరించడం ద్వారా కరణ్ నుంచి రూ.5 కోట్లు వసూలు చేసేందుకు ప్లాన్ వేసినట్టు తెలిపాడు. 

అయితే, ఈ గ్యాంగ్ స్టర్ మాటలు నమ్మశక్యంగా లేవని ఓ పోలీసు అధికారి అభిప్రాయపడ్డారు. కరణ్ జొహార్ పేరు ఉపయోగించుకుని ఏదో గొప్పలు చెప్పుకుంటున్నట్టుగా సందేహం కలుగుతోందని పేర్కొన్నారు. 

కాగా, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ గతంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను హత్య చేసేందుకు కూడా ప్లాన్ చేయడం తెలిసిందే. ఇటీవల సిద్ధూ మూసేవాలా హత్య నేపథ్యంలో, సల్మాన్ ఖాన్ కు భద్రత పెంచారు.
Karan Johar
Lawrence Bishnoi
Target
Extortion
Bollywood
Sidhu Moosewala

More Telugu News