Nellore District: వీధికో ఎమ్మెల్యే, గ్రామానికో మంత్రి!... ఆత్మ‌కూరులో వైసీపీ ప్ర‌చారంపై బీజేపీ కామెంట్‌!

bjp leader sathya kumar comments on yscrp campaign in atmakur bypoll
  • ఉప ఎన్నిక‌ల్లో వైసీపీ ఓట‌మి భ‌యంలో ఉందన్న సత్యకుమార్ 
  • వైసీపీ పాల‌న‌లో నెల్లూరులో అభివృద్ధి జ‌ర‌గలేదని వెల్లడి 
  • మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి కూడా ఈ ప్రాంతాన్ని ప‌ట్టించుకోలేదని వ్యాఖ్యలు
నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక‌ల ప్ర‌చారం జోరుగా సాగుతున్న వేళ బీజేపీ నేత‌లు కూడా త‌మ అభ్య‌ర్థి గెలుపు కోసం శ్ర‌మిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆదివారం ఆత్మ‌కూరులో ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌త్య‌కుమార్‌, ఎంపీలు సీఎం ర‌మేశ్‌, టీజీ వెంక‌టేశ్‌లు రైతుల‌తో ఆత్మీయ స‌మ్మేళ‌నం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన స‌త్య‌కుమార్ వైసీపీ నేత‌ల ప్ర‌చారంపై ఘాటు విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌ల్లో వైసీపీ ప్రచారం వీధికో ఎమ్మెల్యే, గ్రామానికో మంత్రి అన్న చందంగా సాగుతోందని స‌త్య‌కుమార్ ఎద్దేవా చేశారు. ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మి భ‌యం ప‌ట్టుకున్న కార‌ణంగానే వైసీపీ ఈ త‌ర‌హా ప్ర‌చారానికి శ్రీకారం చుట్టింద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. రాష్ట్ర కేబినెట్‌లో నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రులు ఉన్న‌ప్ప‌టికీ జిల్లా అభివృద్ధిపై వారు దృష్టి సారించ‌లేద‌ని ఆరోపించారు. దివంగ‌త మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి కూడా ఈ ప్రాంతాన్ని ఏమీ ప‌ట్టించుకోలేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.
Nellore District
Atmakur Bypoll
BJP
Sathya Kumar
YSRCP
Mekapati Goutham Reddy

More Telugu News