Avula Subbarao: సికింద్రాబాద్ విధ్వంసం కేసు.. నరసరావుపేట పోలీసుల అదుపులో ఆవుల సుబ్బారావు

Avula Subbarao behind the secunderabad railway incident
  • నరసరావుపేటలో సాయి డిఫెన్స్ అకాడమీని నిర్వహిస్తున్న సుబ్బారావు
  • గుంటూరు నుంచి సికింద్రాబాద్‌కు వందలమంది విద్యార్థులను పంపినట్టు గుర్తింపు
  • ఈ మొత్తం ఘటన వెనక ఉన్నది సుబ్బారావేనంటున్న పోలీసులు
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన విధ్వంసం వెనక ఆవుల సుబ్బారావు అనే డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సాయి డిఫెన్స్ అకాడమీ పేరుతో నరసరావుపేటలో శిక్షణ నిస్తున్న సుబ్బారావు ప్రస్తుతం అక్కడి పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది.

ఆందోళన కోసం వందలమంది విద్యార్థులను గుంటూరు నుంచి సికింద్రాబాద్ కు పంపినట్టు పోలీసులు గుర్తించారు. అలా వచ్చిన విద్యార్థులు శుక్రవారం రైల్వే స్టేషన్‌లో ఆందోళనకు దిగారు. ఆ తర్వాత అది కాస్తా హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు పలు రైళ్లకు చెందిన బోగీలకు నిప్పు పెట్టడంతోపాటు రైల్వే ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ మొత్తం ఘటన వెనక ఉన్నది సుబ్బారావేనని, ఆందోళనకారులను అతడే ప్రేరేపించాడని పోలీసులు గుర్తించారు.
Avula Subbarao
Narasarao Pet
Guntur
Agnipath Scheme

More Telugu News