Mahesh Babu: త్రివిక్రమ్ మూవీలో మహేశ్ ద్విపాత్రాభినయం!

Trivikram and Mahesh Babu movie update
  • మహేశ్ నెక్స్ట్ మూవీకి సన్నాహాలు 
  • వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్  
  • హ్యాట్రిక్ హిట్ పడే ఛాన్స్ 
  • సంక్రాంతికి రిలీజ్ చేసే ఆలోచన
మొదటి నుంచి కూడా మహేశ్ బాబుకి ఒక అలవాటు ఉంది. తనకి హిట్ ఇచ్చిన దర్శకులతో మళ్లీ మళ్లీ కలిసి పనిచేయడానికి ఆయన ఆసక్తిని చూపుతుంటారు. అలా త్రివిక్రమ్ దర్శకత్వంలో రెండు సినిమాలు చేసిన మహేశ్ బాబు, మూడో సినిమాను చేయడానికి రెడీ అవుతున్నాడు. వచ్చేనెల 2వ వారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

ఈ సినిమాలో మహేశ్ బాబు ద్విపాత్రాభినయం చేయనున్నాడని అంటున్నారు. రెండు పాత్రలను కూడా త్రివిక్రమ్ ఎంతో వైవిధ్యభరితంగా తీర్చిదిద్దినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే పాత్రను ఆయన డిజైన్ చేసిన తీరు కొత్తగా అనిపిస్తుందని చెబుతున్నారు. ఈ పాత్రలో మహేశ్ బాబు మరింత డిఫరెంట్ గా కనిపిస్తాడని అంటున్నారు.

ఈ సినిమాలో మహేశ్ సరసన నాయికగా పూజ హెగ్డేను తీసుకున్నారు. మరో కథానాయికకి చోటు ఉందనే టాక్ వినిపిస్తోంది. ఆ పాత్ర కోసం రష్మికను తీసుకునే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. సంక్రాంతి బరిలోకి ఈ సినిమాను దింపాలనే ఆలోచన చేస్తున్నారు. చెరో రెండు హిట్లతో ఉన్న త్రివిక్రమ్ - మహేశ్ లు ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొడతారేమో చూడాలి.  

Mahesh Babu
Pooja Hegde
Trivikram Srinivas

More Telugu News