Saitej: 'రచ్చ' దర్శకుడితో మెగా మేనల్లుడు!

Saitej in Sampath Nandi movie
  • మళ్లీ రంగంలోకి దిగిన సాయితేజ్ 
  • కార్తీక్ దండుతో దర్శకత్వంలో తాజా చిత్రం 
  • సముద్రఖనితో సినిమాకి సన్నాహాలు 
  • లైన్లోకి వచ్చిన సంపత్ నంది
సాయితేజ్ కి 'రిపబ్లిక్' తరువాత గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన తన తదుపరి ప్రాజెక్టులను చకచకా లైన్లో పెట్టేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన కార్తీక్ దండు దర్శకత్వంలో ఒక థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ - సుకుమార్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణ జరుపుకుంది.

ఈ సినిమా షూటింగు దశలో ఉండగానే ఆయన సముద్రఖని దర్శకత్వంలో 'వినోదయా సితం' రీమేక్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ప్రధానమైన పాత్రను పోషించనున్న ఈ సినిమాలో సాయితేజ్ కీలకమైన పాత్రలో చేయనున్నట్టుగా సమాచారం. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందని అంటున్నారు. 

 ఇక ఈ లోగానే సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సాయితేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సంపత్ నంది ఖాతాలో 'రచ్చ' .. 'బెంగాల్ టైగర్' వంటి హిట్స్ ఉన్నాయి. ఇటీవల ఆయన నుంచి 'సీటీమార్' వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. యంగ్ హీరోలకు పోటీ ఇవ్వడానికి సాయితేజ్ మళ్లీ రెడీ అవుతున్నాడన్న మాట.
Saitej
Sampath Nandi

More Telugu News