CM Jagan: రోడ్ల నిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష... అభివృద్ధి పనులకు మోకాలడ్డుతున్నాయని విపక్షాలపై ఆగ్రహం

CM Jagan fires on opposition parties
  • విపక్షాలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపణ
  • నిధులు రాకుండా చేస్తున్నాయని మండిపాటు
  • రుణాలు లభించకుండా అడ్డుకుంటున్నారని వెల్లడి
ఏపీలో రోడ్ల నిర్మాణం, మరమ్మతుల పనులపై సీఎం జగన్ నేడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విపక్షాలపై మండిపడ్డారు. తాము అభివృద్ధి పనులు చేపడుతుంటే, విపక్షనేతలు ఆ పనులకు మోకాలడ్డుతున్నారని ఆరోపించారు. కేంద్రం నుంచి నిధులు రాకుండా చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని, కేసుల సాయంతో అడ్డుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి రుణాలు లభించకుండా చేయాలని కంకణం కట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రతిపక్షాలు ఈ తరహా అజెండాతో పనిచేస్తున్నప్పటికీ, తాము ఎక్కడా మడమ తిప్పడంలేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. అభివృద్ధి పనులకు నిధుల లోటు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను ఎంత కష్టమైనా సరే పూర్తిచేస్తున్నామని ఉద్ఘాటించారు.
CM Jagan
Opposition Parties
YSRCP
Andhra Pradesh

More Telugu News