Agnipath Scheme: సాయి డిఫెన్స్ అకాడెమీ య‌జ‌మాని ఆవుల సుబ్బారావుకు ఐటీ నోటీసులు

it notices to avula subbarao over secunderabad agitations
  • అగ్నిప‌థ్ అల్ల‌ర్ల నిందితుల‌ను ప్రోత్స‌హించార‌ని సుబ్బారావుపై ఆరోప‌ణ‌లు
  • సాయి డిఫెన్స్ అకాడెమీలో ఐటీ, ఐబీ అధికారుల సోదాలు
  • తాజాగా సుబ్బారావుకు నోటీసులు జారీ చేసిన ఐటీ శాఖ‌
  • ఈ నెల 27న విచార‌ణ‌కు రావాలంటూ ఆదేశాలు
అగ్నిప‌థ్ ప‌థ‌కాన్ని నిర‌సిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో జ‌రిగిన విధ్వంసం కేసులో అల్ల‌ర్ల‌ను ప్రోత్స‌హించార‌న్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న సాయి డిఫెన్స్ అకాడెమీ య‌జ‌మాని ఆవుల సుబ్బారావుకు మంగ‌ళ‌వారం ఆదాయ ప‌న్ను శాఖ నోటీసులు అంద‌జేసింది. ఈ నెల 27న త‌మ ముందు విచార‌ణకు హాజ‌రు కావాల‌ని ఆ నోటీసుల్లో ఐటీ అధికారులు సుబ్బారావును ఆదేశించారు.

ఏపీలోని ప‌ల్నాడు జిల్లా న‌ర‌స‌రావుపేట‌లో సాయి డిఫెన్స్ అకాడెమీ పేరిట ఓ సంస్థ‌ను ఏర్పాటు చేసిన ఆవుల సుబ్బారావు సైన్యంలో చేరాల‌నుకునే యువ‌త‌కు శిక్ష‌ణ ఇస్తున్నారు. ఈ క్ర‌మంలో అగ్నిప‌థ్ ప‌థ‌కానికి నిర‌స‌న‌గా జ‌రుగుతున్న ఆందోళ‌న‌ల్లో పాల్గొనాల‌ని, విధ్వంసం సృష్టించాల‌ని ఆయ‌న త‌న వ‌ద్ద శిక్ష‌ణ తీసుకున్న అభ్య‌ర్థుల‌కు సూచించిన‌ట్లు ఆరోప‌ణ‌లు వినిపించాయి. దీంతో సోమ‌వారం న‌ర‌స‌రావుపేట వ‌చ్చిన ఐటీ, ఐబీ అధికారులు ఆయ‌న అకాడెమీలో సోదాలు చేశారు. తాజాగా విచార‌ణ‌కు రావాలంటూ సుబ్బారావుకు ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
Agnipath Scheme
IT Raids
IT Notice
Avula Subbarao
Sai Defence Academy
Narasaraopet

More Telugu News