Shootings: తమిళ, హిందీ చిత్రాల షూటింగులకు కూడా సినీ కార్మికుల నిరసన సెగ

Tamil and Hindi film shootings at Hyderabad halted due to cine workers strike
  • వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికుల సమ్మె
  • ఫెడరేషన్ కార్యాలయం ముట్టడి
  • జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్లే బస్సుల నిలిపివేత
  • 20కి పైగా సినిమాల చిత్రీకరణలు నిలిచిపోయిన వైనం
టాలీవుడ్ సినీ కార్మికులు సమ్మెకు దిగడంతో ఆ ప్రభావం పరభాషా చిత్రాల షూటింగులపైనా పడింది. వేతనాలు పెంచాలంటూ 24 క్రాఫ్ట్స్ కు చెందిన కార్మికులు ఫిలిం ఫెడరేషన్ వద్ద ఆందోళనకు దిగారు. జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్లే బస్సులను కూడా నిలిపివేశారు. సినీ కార్మికులెవరూ షూటింగులకు హాజరుకాలేదు. దాంతో, హైదరాబాదులోనూ, నగర పరిసరాల్లోనూ షూటింగులు జరుపుకుంటున్న 20కి పైగా తెలుగు, తమిళ, హిందీ చిత్రాలకు ఆటంకం ఏర్పడింది. ఆయా సినిమాల చిత్రీకరణలు నిలిచిపోయాయి.
Shootings
Telugu
Tamil
Hindi
Cine Workers
Strike
Protests

More Telugu News