Enforcement Directorate: ఈడీ ప్ర‌శ్న‌కు తానిచ్చిన‌ ఆన్స‌ర్‌ను చెప్పిన రాహుల్ గాంధీ.. సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్

trolling over rahul gandhi commments on ed enquiry

  • నిన్న‌టితో ముగిసిన రాహుల్ ఈడీ విచార‌ణ‌
  • చివ‌రి రోజు 15 గంట‌ల‌కు పైగా సాగిన విచార‌ణ‌
  • అన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాదానం ఇచ్చాన‌న్న రాహుల్‌
  • ఇంత స‌హ‌నం ఎక్క‌డిద‌ని ఈడీ అధికారులు అడిగార‌ని వెల్ల‌డి
  • కాంగ్రెస్ పార్టీ స‌హ‌నం నేర్పింద‌ని చెప్పాన‌న్న రాహుల్ గాంధీ

నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు 5 రోజుల పాటు విచారించిన సంగ‌తి తెలిసిందే. ఐదో రోజైన మంగ‌ళ‌వారం ఆయ‌న‌ను ఈడీ అధికారులు రాత్రి పొద్దుపోయే దాకా ఏకంగా 15 గంట‌ల పాటు విచారించారు. ఈ విచార‌ణ‌లో రాహుల్ గాంధీపై ఈడీ అధికారులు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. విచార‌ణ ముగిసిన నేపథ్యంలో పార్టీ నేత‌ల‌తో బుధ‌వారం భేటీ అయిన రాహుల్ గాంధీ విచార‌ణ‌లో త‌న‌కు ఎదురైన అనుభ‌వాల‌ను వివ‌రించారు.

ఈ సంద‌ర్భంగా చివ‌రి రోజు విచార‌ణ‌లో భాగంగా తాము అడిగిన అన్ని ప్ర‌శ్న‌ల‌కు స‌మాధాన‌మిచ్చారు క‌దా.. ఇంత‌టి స‌హ‌నం మీకు ఎలా వ‌చ్చింది? అని ఈడీ అధికారులు త‌న‌ను అడిగిన‌ట్లు రాహుల్ గాంధీ చెప్పారు. 2004 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను క‌దా... కాంగ్రెస్ పార్టీలో ఉంటే స‌హ‌నం దానిక‌దే అల‌వ‌డుతుంది... కాంగ్రెస్ పార్టీ త‌న కార్య‌క‌ర్త‌ల‌కు స‌హ‌నాన్ని నేర్పుతుంది... అని తాను స‌మాధానం చెప్పిన‌ట్లు రాహుల్ చెప్పుచొచ్చారు. ఈ వ్యాఖ్య‌ల‌కు సంబంధించిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో పోస్ట్ కాగా... రాహుల్ గాంధీపై నెటిజ‌న్లు ట్రోలింగ్‌కు దిగారు.

ఒకదాని త‌ర్వాత మ‌రొక‌టి వ‌రుస‌బెట్టి చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓట‌మిపాలైంది... అయినా స‌హ‌నంతో ఉంటున్న మీరు కాంగ్రెస్ ముక్త్ భార‌త్ చూస్తారు అని ఓ నెటిజ‌న్ కామెంట్ చేశారు. రాహుల్ గురించి అమెరికా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా త‌న పుస్త‌కంలో చెప్పిన మాట‌లు అక్ష‌రాల స‌త్య‌మంటూ మ‌రో నెటిజ‌న్ పేర్కొన్నాడు. మ‌రో నెటిజ‌న్ అయితే... మేమ‌డిగిన ప్ర‌శ్న‌ల‌న్నింటికీ త‌ప్పుడు స‌మాధానాలు ఇచ్చేంత స‌హ‌నం మీకెక్క‌డిది అని ఈడీ అధికారులు అడిగి ఉంటారంటూ మ‌రింత ఘాటు కామెంట్ చేశారు.

  • Loading...

More Telugu News