Jos Buttler: లయ తప్పిన బాల్.. ఉతికి పారేసిన బట్లర్

Double bounce delivery lands outside the pitch Jos Buttler hits it for six anyway

  • పిచ్ అవతలి వైపు పడి లేచిన బాల్
  • ముందుకు వచ్చి  షాట్ గా మలిచిన బట్లర్
  • సిక్సర్ గా మారి వీక్షకుల గ్యాలరీలో పడిపోయిన బంతి

నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ 64 బంతుల్లో 86 పరుగులతో మెరిశాడు. దీంతో నెదర్లాండ్స్ పై మూడో వన్డేలోనూ ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్ ను 3-0 తేడాతో సొంతం చేసుకుంది. నెదర్లాండ్స్ ఒక్క మ్యాచ్ లోనూ గెలవలేకపోయింది. 

101 పరుగులు చేసిన జేసన్ రాయ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. 29వ ఓవర్లో పౌల్ వాన్ మీకెరెన్ రెండు బౌన్సర్లను సంధించాడు. తర్వాతి బాల్ పిచ్ అవతలి వైపు పడింది. నిజానికి ఇది నో బాల్. అయినా బట్లర్ దాన్ని కనికరించలేదు. ముందుకు వచ్చి, పక్కకు జరిగి మరీ ఆ బాల్ ను చీల్చి చెండాడాడు. దాంతో అది వెళ్లి వీక్షకుల గ్యాలరీలో పడిపోయింది. అలా నో బాల్ లో సిక్సర్ మలిచాడు. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ గాయం కారణంగా దూరమైనప్పటికీ.. ఇంగ్లండ్ జట్టు తన సత్తా ఏంటో నెదర్లాండ్స్ జట్టుకు చూపించింది. 

ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2022 సీజన్ లోనూ రాజస్థాన్ జట్టు తరఫున జోస్ బట్లర్ తన సత్తా చూపించడం తెలిసిందే. సిరీస్ లో బట్లర్ రాణించడంతో రాజస్థాన్ సెమీ ఫైనల్స్ వరకు చేరుకోగలిగింది.

  • Loading...

More Telugu News