aicc: సుబ్బరామి రెడ్డికి కాంగ్రెస్ వర్కింగ్​ కమిటీలో కీలక పదవి

Subbarami Reddy oppointed in congress working committe
  • శాశ్వత ఆహ్వానితుడిగా ఎంపిక
  • మరో ముగ్గురికి కూడా సీడబ్ల్యూసీలో చోటు 
  • ప్రకటించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్
ఆంధప్రదేశ్ కు చెందిన సీనియర్ నేత, పారిశ్రామిక వేత్త, సినీ నిర్మాత టి. సుబ్బరామిరెడ్డికి కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి లభించింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆయనకు చోటు కల్పించారు. ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (సీడబ్ల్యూసీ) లో శాశ్వత ఆహ్వానితుడిగా సుబ్బరామిరెడ్డిని నియమించారు. కమిటీలో మరో ముగ్గురికి కూడా అవకాశం ఇచ్చారు. 

 కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా కుమారి సెల్జ, డాక్టర్ అభిషేక్ మను సింఘ్వి ఎంపియ్యారు. అలాగే, ప్రత్యేక ఆహ్వానితులుగా అజయ్ కుమార్ లల్లూకు అవకాశం ఇచ్చారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితుడైన సుబ్బరామిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి చాన్నాళ్ల నుంచి సేవ చేస్తున్నారు. రెండు సార్లు లోక్ సభ సభ్యుడిగా, మంత్రిగా పని చేశారు. రాజ్యసభకు కూడా ప్రాతినిధ్యం వహించారు.
aicc
T. Subbarami Reddy
cwc
Andhra Pradesh
mp

More Telugu News