Telugudesam: టీడీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీకాంత్.. ప్రకటించిన చంద్రబాబు

Kancharla Srikanth is the TDP Graduate MLC Candidate
  • రాష్ట్ర ఐటీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్న శ్రీకాంత్
  • ఆయన గెలుపునకు కృషి చేయాలని కోరుతూ నేతలకు చంద్రబాబు ఫోన్లు
  • పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను ఎంపిక చేయడంపై శ్రీకాంత్ హర్షం
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కంచర్ల శ్రీకాంత్‌ను ఎంపిక చేసినట్టు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తెలిపారు. కందుకూరు ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీ కోశాధికారి, రాష్ట్ర ఐటీడీపీ అధికార ప్రతినిధి అయిన శ్రీకాంత్‌ గెలుపునకు సహకరించాలని కోరుతూ మూడు జిల్లాల పరిధిలోని పార్టీ అధ్యక్షులు, ముఖ్యనాయకులకు చంద్రబాబు నిన్న ఫోన్లు చేశారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను ఎంపిక చేయడంపై హర్షం వ్యక్తం చేసిన శ్రీకాంత్.. పార్టీ అధినేత చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ‌లను కలిసి పుష్పగుచ్ఛాలు అందించి కృతజ్ఞతలు తెలిపారు.
Telugudesam
MLC
Kancharla Srikanth
Graduate MLC

More Telugu News