Omar Abdullah: గుజరాతీ చాక్లెట్ శాండ్ విచ్ చూసి సంభ్రమాశ్చర్యాలకు గురైన జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా

Omar Abdullah shares Gujarathi Chocolate Sandwich making video

  • గుజరాతీ వంటకాలంటే తనకు ఇష్టమన్న ఒమర్  
  • తాజాగా చాక్లెట్ శాండ్ విచ్ కు ఫిదా
  • వీడియో పంచుకున్న కశ్మీరీ నేత
  • ఇదేం కాంబినేషన్... అంటూ విస్మయం

జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా సోషల్ మీడియాలో ఆసక్తికర వీడియో క్లిప్పింగ్ ను పంచుకున్నారు. అందులో గుజరాతీ చాక్లెట్ శాండ్ విచ్ తయారుచేయడాన్ని చూపించారు. ఆ శాండ్ విచ్ ఎలా చేశారో చూశాక మతిపోయిందని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. 

"అసలు ఈ శాండ్ విచ్ తయారీకి ఉపయోగించిన పదార్థాల కాంబినేషన్ ను ఎవరు కనిపెట్టారో...? దీని అమ్మకాల సంగతేంటి?" అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాను గుజరాతీ వంటకాలను విపరీతంగా ఇష్టపడతానని, కానీ ఈ చాక్లెట్ శాండ్ విచ్ కు అగ్రస్థానం ఇస్తానని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. 

కాగా, ఈ వీడియోలో ఓ హృదయాకరంలో ఉన్న బ్రెడ్, బటర్, జామ్, డెయిరీ మిల్క్ చాక్లెట్ తురుము, చీజ్ తురుము, చాకోబార్ పై భాగంలో ఉండే చాక్లెట్ ను ఉపయోగించి శాండ్ విచ్ తయారు చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.

  • Loading...

More Telugu News