Madhavan: భారత అంగారక యాత్రకు పంచాంగం తోడ్పడిందన్న నటుడు మాధవన్... నెటిజన్ల విమర్శల వర్షం

Madhavan gets trolled after his comments on ISRO Mars Mission
  • రాకెట్రీ చిత్రానికి దర్శకత్వం వహించిన మాధవన్
  • ప్రమోషన్ కార్యక్రమాలతో మాధవన్ బిజీ
  • భారత మార్స్ మిషన్ పై వ్యాఖ్యలు
  •  పంచాంగం చూసి ముహూర్తం పెట్టారని వెల్లడి
  • చెత్తవాగుడు కట్టిపెట్టాలన్న నెటిజన్లు
ప్రముఖ నటుడు మాధవన్ స్వయంగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం రాకెట్రీ: ద నంబి ఎఫెక్ట్. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో మాధవన్ బిజీగా ఉన్నారు. అయితే భారత అంతరిక్ష పరిశోధన రంగంపై మాధవన్ చేసిన వ్యాఖ్యలు నెటిజన్లను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. 

ఇస్రో చేపట్టిన అంగారక యాత్రకు పంచాంగం తోడ్పడిందని మాధవన్ పేర్కొన్నారు. పంచాంగం చూసి పెట్టిన ముహూర్త బలంతో భారత్ మార్స్ మిషన్ అవాంతరాలను అధిగమించగలిగిందని అన్నారు. గ్రహగతులన్నీ పంచాంగంలో నిక్షిప్తమై ఉంటాయని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో మాధవన్ ను నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. 

సైన్స్ గురించి తెలియకపోవడం తప్పేమీ కాదని, కానీ మాధవన్ చెత్తవాగుడు కట్టిపెట్టాలని ఒకరు... వాస్తవాలు తెలియకుండా మాధవన్ మాట్లాడిన మాటలు వింటుంటే ఓ మూర్ఖుడిలా అనిపించాడని మరొకరు... మాధవన్ ఇకపై అధికారికంగా చాక్లెట్ బాయ్ నుంచి వాట్సాప్ అంకుల్ అయ్యాడని ఇంకొకరు... మాధవన్ మాట్లాడకుండా ఉంటేనే ముద్దొస్తుంటాడని మరొకరు... ఇలా తలోరకంగా మాధవన్ పై విమర్శలు గుప్పించారు.
Madhavan
Panchangam
Mars Mission
ISRO
Rocketry: The Nambi Effect

More Telugu News