Nara Lokesh: అన్న క్యాంటీన్లను తెరవాలంటూ.. ఏపీ సీఎం జగన్కు నారా లోకేశ్ లేఖ!
- అన్న క్యాంటీన్లను తెరచి పేదల ఆకలిని తీర్చాలన్న లోకేశ్
- రూ.5కే అల్పాహారం ఇవ్వాలన్నదే అన్న క్యాంటీన్ల లక్ష్యమని వెల్లడి
- టీడీపీ హయాంలో హయాంలో 201 అన్న క్యాంటీన్లు తెరిచామన్న లోకేశ్
- అన్న క్యాంటీన్ల కోసం బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించామని స్పష్టీకరణ
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శనివారం ఓ లేఖ రాశారు. అతి తక్కువ ధరకే పేదలకు కడుపు నింపేందుకు ఉద్దేశించిన అన్న క్యాంటీన్లను తెరవాలని సదరు లేఖలో ఆయన జగన్ను కోరారు. అన్న క్యాంటీన్ల కూల్చివేతలు, అడ్డగింతలను ఇకనైనా ఆపాలని సదరు లేఖలో లోకేశ్ కోరారు.
రూ.5కే అల్పాహారం అందించాలన్న లక్ష్యంతో టీడీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా 201 అన్న క్యాంటీన్లను తెరిచామని సదరు లేఖలో లోకేశ్ తెలిపారు. అన్న క్యాంటీన్ల కోసం తమ పార్టీ ప్రభుత్వం బడ్జెట్లో ఏకంగా రూ.200 కోట్లు కేటాయించామని ఆయన చెప్పారు. కనీసం ప్రస్తుతం తమ పార్టీ కొన్ని ప్రాంతాల్లో నడుపుతున్న అన్న క్యాంటీన్లకు వస్తున్న ఆదరణ చూసి అయినా అన్న క్యాంటీన్లను తెరవాలని ఆ లేఖలో ఆయన జగన్కు విజ్ఞప్తి చేశారు.