Srikakulam District: గ్రామ సచివాలయ సిబ్బందిపై దాడి చేసి వారిపైనే కేసు పెట్టిన సర్పంచ్ కుటుంబం... వీడియో ఇదిగో
- శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం కవిటి అగ్రహారంలో ఘటన
- సర్పంచ్ భర్తపై సచివాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు
- తిరిగి సచివాలయ సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సర్పంచ్
- తన మనశ్శాంతికి భంగం కలిగించారని ఆరోపించిన సర్పంచ్
- ఐపీసీ 506,509 సెక్షన్ల కింద సచివాలయ సిబ్బందిపై పోలీసుల కేసులు
శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం కవిటి అగ్రహారం గ్రామ సచివాలయం సిబ్బందిపై గ్రామ సర్పంచ్ బొమ్మాళి వరలక్ష్మి భర్త గున్నయ్య శనివారం దాడికి దిగారు. సచివాలయంలోనే జరిగిన ఈ దాడికి చెందిన దృశ్యాలు మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో గున్నయ్య దాడిలో గాయపడ్డ దివ్యాంగుడైన సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ వాసుదేవరావు శనివారరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా గున్నయ్యపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
అయితే ఆదివారం ఉదయానికి ఈ వ్యవహారం కీలక మలుపు తీసుకుంది. తన మనశ్శాంతికి భంగం కలిగించారంటూ సర్పంచ్ వరలక్ష్మి స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా వాసుదేవరావు సహా సచివాలయంలో పనిచేస్తున్న ఇంజినీరింగ్ అసిస్టెంట్ రాంప్రసాద్, సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ వడ్ని మోహన్ లాల్‌పైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిపై ఐపీసీ 506,509 సెక్షన్ల ఆధారంగా కేసులు నమోదయ్యాయి.