Lagadapati Raja Gopal: లగడపాటి రాజగోపాల్‌పై నమోదైన కేసును కొట్టేసిన ప్రజా ప్రతినిధుల కోర్టు
- 2014 ఎన్నికల ఫలితాలపై ముందుగానే అంచనాలు విడుదల చేసిన లగడపాటి
- ఈ ఆరోపణలతోనే లగడపాటిపై ఈసీ నమోదు చేసిన కేసు
- విజయవాడలోని ప్రజా ప్రతినిధుల కోర్టులో కేసు విచారణ
- ఈ కేసులో ఆరుగురు సాక్షులను విచారించిన కోర్టు
- వీడియో, ఆడియో రికార్డింగ్‌లను పరిశీలించిన న్యాయస్థానం
- సరైన ఆధారాలతో కేసును నిరూపించలేకపోయారన్న కోర్టు
విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పై ఎన్నికల కమిషన్ నమోదు చేసిన కేసును కొట్టివేస్తూ ప్రజా ప్రతినిధుల కోర్టు సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. లగడపాటిపై నమోదు చేసిన కేసును సరైన ఆధారాలతో నిరూపించలేకపోయారని పేర్కొన్న కోర్టు... ఆయనపై నమోదైన కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.
2014 ఎన్నికలకు సంబంధించిన ఫలితాలపై లగడపాటి ముందుగానే అంచనాలను వెల్లడించారంటూ నాడు ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్న భన్వర్‌లాల్ కేసు నమోదు చేశారు. ఈ కేసును విజయవాడలోని ప్రజా ప్రతినిధుల కోర్టు విచారించింది. విచారణలో భాగంగా ఆరుగురు సాక్షులను కూడా కోర్టు విచారించింది. అంతేకాకుండా వీడియో, ఆడియో రికార్డింగ్‌లను కూడా కోర్టు పరిశీలించింది. ఆపై కేసులో పేర్కొన్న అంశాలకు సంబంధించి సరైన ఆధారాలను చూపించలేకపోయారని కోర్టు వ్యాఖ్యానించింది. కేసును కొట్టివేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.