NASA: తొలిసారిగా అమెరికా వెలుపల రాకెట్ ప్రయోగం చేపట్టిన నాసా

NASA takes up rocket launch for the first time out of US
  • ఆస్ట్రేలియా గడ్డపై నుంచి కమర్షియల్ రాకెట్ ప్రయోగం
  • అంతరిక్షంలో 300 కిమీ ప్రయాణించనున్న రాకెట్
  • ఆల్ఫా సెంటౌరీ ఏ, బీ నక్షత్ర మండలాల పరిశీలన
  • వచ్చే నెలలో ఆస్ట్రేలియా నుంచి మరో రెండు రాకెట్ల ప్రయోగం
ఇప్పటివరకు అమెరికా భూభాగం నుంచే వాణిజ్యపరమైన రాకెట్ల ప్రయోగం చేపట్టిన నాసా... తొలిసారిగా విదేశీ గడ్డపై రాకెట్ ప్రయోగం చేపట్టింది. ఆస్ట్రేలియాలోని దుపుమా పీఠభూమిలో ఉన్న ఆర్నహెమ్ స్పేస్ సెంటర్ నుంచి కమర్షియల్ రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. ఆల్ఫా సెంటౌరీ ఏ, బీ నక్షత్ర మండలాలను పరిశీలించడం ఈ రాకెట్ ప్రయోగం వెనుక ముఖ్య ఉద్దేశం. ఈ రాకెట్ అంతరిక్షంలో 300 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించనుంది. 

కాగా, ఆస్ట్రేలియా నుంచి మరో రెండు రాకెట్లను వచ్చే నెల 4, 12 తేదీల్లో నాసా ప్రయోగించనుంది. ఈ మేరకు సన్నాహాలు జరుగుతున్నాయి. 

ఆర్నహెమ్ స్పేస్ సెంటర్ ను ఈక్విటోరియల్ లాంచ్ ఆస్ట్రేలియా (ఈఎల్ఏ) అనే సంస్థ నిర్వహిస్తోంది. తాజా ప్రయోగం పట్ల ఈఎల్ఏ పొంగిపోతోంది. ఈఎల్ఏ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సీఈవో మైకేల్ జోన్స్ స్పందిస్తూ, నాసా వంటి దిగ్గజ సంస్థతో తాము భాగస్వామ్యం అందుకుంటామని కలలో కూడా అనుకోలేదని వ్యాఖ్యానించారు. ఇది చారిత్రాత్మక ప్రయోగం అని అభివర్ణించారు. నాసా మద్దతుతో తమ సంస్థ మరింత అభివృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
NASA
Rocket
Launch
Australia
USA

More Telugu News