china: కరోనా కేసులను కంట్రోల్​ లోకి తెచ్చిన చైనా.. షాంఘై, బీజింగ్​ లలో ఆంక్షలు సడలింపు

China brings corona cases under control eases sanctions in Shanghai and Beijing
  • చైనాలో ఆరు నెలల కింద కరోనా వేవ్ మొదలు
  • నాలుగు నెలలకుపైగా కొనసాగిన కఠిన ఆంక్షలు
  • స్కూళ్లు, షాపింగ్ మాల్స్ వంటివీ మూత
  • రోజూ లక్షల కొద్దీ కరోనా పరీక్షలు
దాదాపు ఆరు నెలలు కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్, కఠిన ఆంక్షలతో అతలాకుతలమైన చైనాలో పరిస్థితులు మళ్లీ యథాతథ స్థితికి చేరుకుటున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణ కారణంగా.. దాదాపు నాలుగు నెలలుగా చైనాలోని షాంఘై, బీజింగ్ నగరాల్లో జనం గుమిగూడే ప్రదేశాలైన షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాల్స్, సినిమా థియేటర్లు, విద్యా సంస్థలు మూత పడి ఉన్నాయి. 2.5 కోట్ల మందికిపైగా పూర్తి లాక్ డౌన్ లో ఉండాల్సి వచ్చింది. ఇటీవలే కొద్ది కొద్దిగా ఆంక్షలు సడలిస్తూ వచ్చారు.

జీరో కొవిడ్ కేసుల లక్ష్యంతో..
చైనా జీరో కొవిడ్‌ లక్ష్యంగా అక్కడి అధికారులు కఠిన ఆంక్షలు, లాక్‌డౌన్‌లు అమలు చేయడంతోపాటు అత్యంత భారీ సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రతిచోటా దొరికినవారికి దొరికినట్టుగా పరీక్షలు చేశారు. పాజిటివ్ వచ్చినవారిని క్వారంటైన్ చేశారు. కాంటాక్ట్ ట్రేసింగ్ చేశారు. ఈ క్రమంలో కేసులు తగ్గుతూ వచ్చాయి. తాజాగా బీజింగ్‌, షాంఘైల్లో ఎట్టకేలకు సోమవారం ఒక్క  కొవిడ్‌ కేసు కూడా నమోదు కాలేదు. దేశవ్యాప్తంగా కూడా కేవలం 22 మాత్రమే నమోదైనట్లు అక్కడి జాతీయ హెల్త్‌ కమిషన్‌ తెలిపింది. 

పాఠశాలలు ఓపెన్..
కరోనా నియంత్రణలోకి రావడంతో బీజింగ్, షాంఘై ప్రావిన్స్ లలో పాఠశాలలను తెరిచారు. షాపింగ్ మాల్స్ వంటి వాటికి పరిమితులతో అనుమతులు ఇచ్చారు. ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి. టెస్టుల్లో నెగెటివ్ వచ్చినవారికి ప్రత్యేక యాప్ లో గ్రీన్ కోడ్ ఇస్తున్నారు. జనం ఎక్కడికి వెళ్లినా ఆ కోడ్ చూపాల్సి ఉంటుంది. ప్రతి మూడు రోజులకోసారి టెస్టులు చేయించుకుని, గ్రీన్ కోడ్ ను అప్ డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది.

china
Corona Virus
COVID19
Corona control
corona lockdown

More Telugu News