YSRCP: నాది గుడివాడ.. 2024లో గెలుస్తా.. ఇక్కడే మట్టిలో కలిసిపోతా: కొడాలి నాని

kodali nani comments on 2024 and 2029 elections
  • 2004లో గుడివాడ నుంచి గెలిచాన‌న్న కొడాలి నాని
  • 2024లోనూ గెలుస్తాన‌ని ప్ర‌క‌ట‌న‌
  • 2029లోనూ గెలుపు త‌న‌దేన‌ని వెల్ల‌డి
  • గుడివాడ‌లోనే మ‌ట్టిలో క‌లిసిపోతాన‌న్న నాని
కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2004 నుంచి వ‌రుస‌గా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజ‌యం సాధించిన వైసీపీ కీల‌క నేత‌, మాజీ మంత్రి కొడాలి శ్రీ వెంక‌టేశ్వ‌ర‌రావు (కొడాలి నాని) తాజాగా 2024, 2029 ఎన్నిక‌ల్లోనూ విజ‌యం సాధిస్తానంటూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ గుడివాడ నియోజ‌క‌వర్గ స్థాయి ప్లీన‌రీ మంగ‌ళ‌వారం గుడివాడ‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన కొడాలి నాని ఉద్వేగ‌భ‌రిత వ్యాఖ్య‌లు చేశారు. 

గుడివాడ త‌న అడ్డా అన్న రీతిలో ఆవేశంగా మాట్లాడిన కొడాలి నాని వ్యాఖ్య‌ల‌కు వైసీపీ శ్రేణుల నుంచి కూడా మంచి రెస్పాన్సే వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా నాని ఏమ‌న్నారంటే.. "నాది గుడివాడ‌. నేను 2004లో గెలిచా. 2009లో గెలిచా. 2014లో గెలిచా. 2019లో గెలిచా. 2024లో గెలుస్తా. 2029లో గెలుస్తా. ఇక్క‌డే పుట్టా. ఇక్క‌డే చ‌నిపోతా. ఇక్క‌డే మ‌ట్టిలో క‌లిసిపోతా" అంటూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.
YSRCP
Kodali Nani
Gudivada
Krishna District
Plenary

More Telugu News