Prabhas: దసరాకి ప్రభాస్ తో సెట్స్ పైకి వెళుతున్న మారుతి!

Prabha in Maruthi Movie
  • చిరంజీవి ప్రకటనపై స్పందించిన మారుతి 
  • తన ఆత్మవిశ్వాసం పెరిగిందంటూ వ్యాఖ్య 
  • ఇక కథపై కూర్చుంటానంటూ వివరణ 
  • యూవీ క్రియేషన్స్ లోనే ప్రభాస్ సినిమా
ప్రభాస్ హీరోగా మారుతి ఒక సినిమా చేయనున్నాడనే టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. అయితే ఆ సినిమా ఏ జోనర్ లో  ఉంటుంది? ఎవరు నిర్మిస్తున్నారు? ఎప్పుడు మొదలవుతుంది? అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తాజా ఇంటర్వ్యూలో  మారుతి మాట్లాడుతూ, ప్రభాస్ సినిమా నుంచి అభిమానులు ఆశించే అన్ని అంశాలు ఇందులో ఉంటాయని చెప్పాడు. 

'డార్లింగ్' .. 'బుజ్జిగాడు' తరహాలో ఈ కథ నడుస్తుందని ఇంతకుముందే మారుతి చెప్పాడు. ప్రభాస్ మార్క్ యాక్షన్ తో తన మార్క్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుందని అన్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితం కానున్న ఈ సినిమాను, దసరాకి సెట్స్ పైకి తీసుకుని వెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నారట. 

ఇక చిరంజీవి సినిమాను గురించి మారుతి మాట్లాడుతూ .. " నాతో సినిమా చేయడానికి రెడీగా ఉన్నానని ఒక పబ్లిక్ ఈవెంట్ లో చిరంజీవిగారు చెప్పడం నిజంగా నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. నాపై నమ్మకం ఉందని చిరంజీవిగారు చెప్పడం, నాలో మరింత ఆత్మవిశ్వాసం పెంచింది. త్వరలోనే కథను రెడీ చేయడం మొదలుపెడతాను" అని చెప్పుకొచ్చాడు.
Prabhas
Chiranjeevi
Maruthi Movie

More Telugu News