Election Commission: ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌కు షెడ్యూల్ విడుద‌ల‌

ece issues shcedule for the election of vice president of india

  • ఆగ‌స్టు 6న పోలింగ్‌, ఓట్ల లెక్కింపు
  • జులై 5న‌ విడుద‌ల కానున్న నోటిఫికేష‌న్‌
  • నామినేష‌న్ల దాఖ‌లుకు జులై 19 వ‌ర‌కు గ‌డువు
  • జులై 22 వ‌ర‌కు నామినేషన్ల ఉప‌సంహ‌ర‌ణ‌

భార‌త ఉపరాష్ట్రప‌తి ఎన్నిక‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ విడుద‌ల చేసింది. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక సంఘం బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ షెడ్యూల్ ప్ర‌కారం జులై 5న ఉప‌రాష్ట్రప‌తి ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. అదే రోజు నుంచి నామినేష‌న్ల దాఖ‌లు ప్రారంభం కానుండ‌గా... జులై 19 వ‌ర‌కు నామినేష‌న్ల దాఖ‌లుకు అనుమతించనున్నారు. 

జులై 20న నామినేష‌న్ల ప‌రిశీల‌న జ‌ర‌గ‌నుండగా... నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు జులై 22 వ‌ర‌కు గ‌డువు విధించారు. ఇక ఉపరాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో కీల‌క ఘ‌ట్ట‌మైన పోలింగ్‌ను ఆగ‌స్టు 6న ఉద‌యం 10 గంట‌ల నుంచి  సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. పోలింగ్ ముగిసిన వెంట‌నే అదే రోజుల ఓట్ల లెక్కింపును నిర్వ‌హించనున్న కేంద్ర ఎన్నిక‌ల సంఘం విజేత‌ను ప్ర‌క‌టించ‌నుంది. పార్లమెంటు ఉభయసభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటుంది.

  • Loading...

More Telugu News