Sensex: మార్కెట్ల నాలుగు రోజుల లాభాలకు బ్రేక్
- 150 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 51 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 3.46 శాతం నష్టపోయిన హిందుస్థాన్ యూనిలీవర్
దేశీయ స్టాక్ మార్కెట్ల నాలుగు రోజుల వరుస లాభాలకు నేడు బ్రేక్ పడింది. ఈరోజు మార్కెట్లు నష్టపోయాయి. ఈ ఉదయం భారీ నష్టాల్లో మార్కెట్లు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్న సమయానికి కోలుకున్నాయి. అయితే చివర్లో మళ్లీ అమ్మకాల ఒత్తిడి ఎదురు కావడంతో తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 150 పాయింట్లు కోల్పోయి 53,026కి పడిపోయింది. నిఫ్టీ 51 పాయింట్లు నష్టపోయి 15,799 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (2.42%), రిలయన్స్ (1.98%), సన్ ఫార్మా (1.52%), అల్ట్రాటెక్ సిమెంట్ (0.90%), ఐటీసీ (0.81%).
టాప్ లూజర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (-3.46%), యాక్సిస్ బ్యాంక్ (-2.57%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.19%), టైటాన్ (-1.59%), విప్రో (-1.59%).