GST: జీఎస్టీ పెంచడంతో.. వీటి కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సిందే!

GST new rates explained Full list of items services to get costlier

  • ప్యాక్ చేసి విక్రయించే అప్పడాలు, బటర్ మిల్క్, లస్సీ, తేనెపై 5 శాతం
  • పెన్సిల్ షార్ప్ నర్లు, ఎల్ఈడీ లైట్లపై 18 శాతం పన్ను
  • బ్యాంకు చెక్ బుక్ చార్జీలపైనా జీఎస్టీ

వస్తుసేవల పన్ను (జీఎస్టీ) పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నందున కొన్ని ఉత్పత్తుల కొనుగోలుకు మరింత ఖర్చు చేయక తప్పదు. కేంద్ర ఆర్థికమంత్రి అధ్యక్షతన, రాష్ట్రాల ఆర్థికమంత్రులతో కూడిన జీఎస్టీ కౌన్సిల్ బుధవారం నాటి భేటీలో పలు నిర్ణయాలు తీసుకుంది.

  • సవరించిన రేట్లు..
    ప్యాక్ చేసి, పైన లేబుల్ వేసి విక్రయించే అప్పడాలు, మాంసం, చేపలు, పెరుగు, లస్సీ, బటర్ మిల్క్, పనీర్, తేనె, ఆరబెట్టిన చిక్కుళ్లు, ఎండబెట్టిన మఖానా, గోధుమలు, ఇతర పప్పు ధాన్యాలు, బెల్లం, మరమరాలు వీటన్నింటినీ జీఎస్టీ 5 శాతం పన్ను పరిధిలో చేర్చారు. 
  • ప్యాక్ చేయని, లేబుల్ వేయకుండా విక్రయించే ఆహార పదార్థాలపై ఇక ముందూ ఎటుంవంటి పన్ను ఉండదు. 
  • వంట నూనెలు, బొగ్గు, ఎల్ఈడీ బల్బులు, ప్రింటింగ్/డ్రాయింగ్ ఇంక్, ఫినిష్డ్ లెదర్, సోలార్ వాటార్ హీటర్ పై పన్ను నిర్మాణాన్ని సరిదిద్దాలని కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. 
  • ఇంక్, పెన్సిల్ షార్ప్ నర్లు, కట్లరీ, ఎల్ఈడీ ల్యాంప్ లు, డైరీ, పౌల్ట్రీ, హార్టికల్చర్ మెషినరీపై 18 శాతం జీఎస్టీ అమలవుతుంది. 
  • బ్లేడ్లు, స్పూన్లు, ఫోర్క్ లపైనా (కట్లరీ) 18 శాతం జీఎస్టీ పడనుంది.  
  • లైట్లు, ఫిక్సర్లు, మెటల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులపై జీఎస్టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచారు. 
  • బ్యాంకులు చెక్ బుక్ పేరిట వసూలు చేసే చార్జీలపై 18 శాతం జీఎస్టీ పడుతుంది. 
  • మ్యాపులు, చార్ట్ లు, అట్లాస్ లపై 12 శాతం పన్ను వర్తిస్తుంది.
  • రూ.1,000 చార్జీలోపు ఉన్న హోటల్ గదులకు 12 శాతం జీఎస్టీ అమలు కానుంది.
  • రోప్ వేల ద్వారా వస్తువులు, మనుషుల రవాణాపై 18 శాతం జీఎస్టీ కాస్తా 5 శాతానికి తగ్గుతుంది.
  • ట్రక్కుల అద్దె రూపంలో వచ్చే ఆదాయంపై 18 శాతం జీఎస్టీ రేటు 12 శాతానికి తగ్గుతుంది. 
  • సవరించిన రేట్లు జులై 18 నుంచి అమల్లోకి వస్తాయని కౌన్సిల్ ప్రకటించింది. 
  • క్యాసినోలు, గుర్రపు పందేలు, ఆన్ లైన్ గేమింగ్ పై 28 శాతం జీఎస్టీ విధించాలని మంత్రుల బృందం ప్రతిపాదనపై నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సిల్ వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News