Saitej: మెగా మేనల్లుళ్లపై దృష్టి పెట్టిన 'కందిరీగ' డైరెక్టర్!
- 'కందిరీగ'తో హిట్ కొట్టిన సంతోష్ శ్రీనివాస్
- ఆ తరువాత పడిన వరుస ఫ్లాపులు
- మెగా మేనల్లుళ్ల కోసం ప్రయత్నాలు
- త్వరలోనే రానున్న క్లారిటీ
'కందిరీగ' సినిమా చూసిన తరువాత ఈ డైరెక్టర్ ఎవరో భలేగా తీశాడని అనుకున్నారు. రామ్ కెరియర్లో అది చెప్పుకోదగిన సినిమాగా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో మంచి రేటింగ్ ను రాబడుతూ ఉంటుంది. అలాంటి హిట్ ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్, ఆ తరువాత 'హైపర్' .. 'రభస' .. 'అల్లుడు అదుర్స్' వంటి ఫ్లాపులను జమచేస్తూ వచ్చాడు.
ఇక తాజాగా ఆయన మెగా మేనల్లుళ్లలో ఒకరితో సినిమా చేయాలనే ఉద్దేశంతో గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడట. వీలైతే సాయితేజ్ .. లేదంటే వైష్ణవ్ తేజ్ అనే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. అయితే సాయితేజ్ ఇప్పుడిప్పుడే తన కెరియర్ ను చక్కబెట్టుకుంటున్నాడు. ఆచి తూచి కథలను .. డైరెక్టర్ లను ఎంచుకుంటున్నాడు.
అందువలన అతను ఇప్పట్లో సంతోష్ శ్రీనివాస్ తో చేయకపోవచ్చని అంటున్నారు. ఇక వైష్ణవ్ తేజ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందువలన ఇప్పట్లో సాధ్యపడకపోవచ్చని టాక్. మరి సంతోష్ శ్రీనివాస్ తన టాలెంట్ తో వాళ్లలో ఒకరిని ఒప్పించగలుగుతాడా? లేదంటే మరో హీరోను వెతుక్కుంటాడా? అనేది చూడాలి.