Vladimir Putin: అమెరికా అధ్యక్షుడితో చర్చించే కంటే వెళ్లి హాకీ ఆడుకుంటా..!: రష్యా అధ్యక్షుడు పుతిన్

vladimir putin told french president macron he would rather play ice hockey than hold peace talks

  • ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ తో రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యాఖ్య
  • ఉక్రెయిన్ పై దాడికి ముందు నాటి ఫోన్ సంభాషణ బయటికి వెల్లడి 
  • ఈ తీరుతోనే ప్రపంచం గందరగోళంలో పడిందనే అభిప్రాయాలు

‘అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో చర్చించడం కంటే వెళ్లి ఐస్ హాకీ ఆడుకుంటా..’ అని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ పై రష్యా దాడికి నాలుగు రోజుల ముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ తో పుతిన్ ఈ మాట అన్నట్టు తాజాగా బయటికి వచ్చింది. ఉక్రెయిన్ పై యుద్ధానికి రష్యా ఎంత మొండిగా ముందుకెళ్లిందనే విషయాన్ని ఈ వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనివల్లే ప్రపంచవ్యాప్తంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు.

గత ఫిబ్రవరిలో చర్చ సందర్భంగా..
ఉక్రెయిన్ పై రష్యా దాడికి సిద్ధమైనప్పుడు యుద్ధాన్ని నివారించడానికి పలు దేశాల అధినేతలు రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈ క్రమంలోనే ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కూడా పుతిన్ కు ఫోన్ చేసి 9 నిమిషాల పాటు చర్చించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో చర్చించాలని సూచించారు. దీనిపై స్పందించిన పుతిన్.. ‘అమెరికా అధ్యక్షుడితో మాట్లాడే కంటే వెళ్లి ఐస్ హాకీ ఆడుకుంటా..’ అని వ్యాఖ్యానించినట్టు తాజాగా వెల్లడైంది. దీనిపై ఓ ఆంగ్ల మీడియా సంస్థ డాక్యుమెంటరీని విడుదల చేసింది.

  • Loading...

More Telugu News