Eknath Shinde: సీఎంగా షిండే, డిప్యూటీ సీఎంగా ఫ‌డ్న‌వీస్ ప్ర‌మాణం

eknath shinde and devendra fadnavis takes oath as cm and deputy cm respectively
  • మ‌హారాష్ట్ర రాజ‌కీయ సంక్షోభానికి తెర  
  • ఇద్ద‌రితో ప్ర‌మాణం చేయించిన గ‌వ‌ర్న‌ర్‌
  • రాజ్ భ‌వ‌న్‌లో జ‌రిగిన ప్ర‌మాణ స్వీకారం
గ‌త కొన్ని రోజులుగా ట్విస్టుల మీద ట్విస్టుల‌తో సాగిన మ‌హారాష్ట్ర రాజ‌కీయ సంక్షోభానికి గురువారం రాత్రితో తెర ప‌డిపోయింది. శివ‌సేన చీఫ్ ఉద్ధ‌వ్ థాక‌రే నేతృత్వంలోని సంకీర్ణ స‌ర్కారుపై తిరుగుబాటు జెండా ఎగుర‌వేసిన మంత్రి ఏక్‌నాథ్ షిండే గురువారం రాత్రి 7.30 గంట‌ల‌కు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ ప్రమాణం చేశారు. శివ‌సేన తిరుగుబాటు వ‌ర్గానికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన విప‌క్ష నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ డిప్యూటీ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కోష్యారీ రాజ్ భ‌వ‌న్‌లో వీరితో ప్రమాణం చేయించారు.
Eknath Shinde
Devendra Fadnavis
Maharashtra
Shiv Sena
BJP

More Telugu News