Tirumala: శ్రీవారి భక్తులకు మరింత భారం... తిరుమల-తిరుపతి మధ్య పెరిగిన ఆర్టీసీ బస్ ఛార్జీలు!

Ticket charge increased between Tirupati and Tirumala

  • డీజిల్ సెస్ పేరుతో ఛార్జీలను పెంచిన ఏపీఎస్ఆర్టీసీ
  • తిరుమల-తిరుపతి మధ్య మరో రూ. 15 పెరిగిన టికెట్ ధర
  • రూ. 75 నుంచి రూ. 90కి పెరిగిన టికెట్ ఛార్జి

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి భక్తులకు భారం మరింత పెరిగింది. తిరుమల-తిరుపతి మధ్య ఆర్టీసీ బస్ ఛార్జీలు భారీగా పెరిగాయి. డీజిల్ సెస్ పేరుతో ఈరోజు నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల ఛార్జీలను పెంచిన సంగతి తెలిసిందే. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు మినహా అన్ని బస్సుల్లో ఛార్జీలను పెంచారు. 

ఈ క్రమంలో తిరుమల, తిరుపతి మధ్య తిరిగే ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో ప్రతి టికెట్ పై రూ. 15 అదనపు భారం పడింది. ప్రస్తుత ఛార్జీ రూ. 75గా ఉండగా... ఇప్పుడది రూ. 90కి పెరిగింది. పిల్లల టికెట్ ధర రూ. 45 నుంచి రూ. 50 అయింది. రానుపోను టికెట్ ధర రూ. 13గా ఉండగా ఇప్పుడది రూ. 160కి పెరిగింది. 2018లో తిరుమల, తిరుపతి మధ్య టికెట్ ధర రూ. 50గా ఉండేది. ఈ నాలుగేళ్లలో ఆ ధర రూ. 40 కి పెరగడం గమనార్హం.

  • Loading...

More Telugu News