Tenth Class: ఏపీలో టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ విద్యార్థులకు తీపి కబురు
- ఇటీవల ఏపీలో టెన్త్ ఫలితాల విడుదల
- త్వరలో అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ
- సప్లిమెంటరీలో పాసైతే రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగణన
- సాధారణ రీతిలోనే డివిజన్ల కేటాయింపు
ఇటీవలే ఏపీలో పదో తరగతి ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే. అయితే, ఫెయిలైన వారి కోసం త్వరలో అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో, ఈ సప్లిమెంటరీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం తియ్యని కబురు అందించింది. అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో పాసయ్యేవారిని కంపార్ట్ మెంటల్ అని కాకుండా, రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగణించాలని నిర్ణయించింది. రెగ్యులర్ విద్యార్థుల తరహాలోనే పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా డివిజన్లు కేటాయించనుంది. ఈ మేరకు నిబంధనలు సడలించారు. దీనిపై పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ మెమో జారీ చేశారు.