Stock Market: నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. భారీగా నష్టపోయిన రిలయన్స్!

Reliance looses more than 7 percent

  • వరుసగా మూడో రోజు నష్టపోయిన మార్కెట్లు
  • 111 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 28 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. హెవీ వెయిట్ రిలయన్స్ తో పాలు పలు ఎనర్జీ స్టాకులు అమ్మకాల ఒత్తిడికి గురి కావడంతో మార్కెట్లు నష్టపోయాయి. చమురు ఉత్పత్తులపై ఎగుమతి సుంకాలను కేంద్రం విధించడంతో ఈ సంస్థలు ఒత్తిడికి గురయ్యాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 111 పాయింట్లు కోల్పోయి 52,907కి పడిపోయింది. నిఫ్టీ 28 పాయింట్లు నష్టపోయి 15,752 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్
ఐటీసీ (3.99%), బజాన్ ఫైనాన్స్ (3.97%), బజాజ్ ఫిన్ సర్వ్ (3.63%), ఏసియన్ పెయింట్స్ (2.80%), హిందుస్థాన్ యూనిలీవర్ (2.34%). 

టాప్ లూజర్స్
రిలయన్స్ (-7.14%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.53%), ఎన్టీపీసీ (-1.82%), భారతి ఎయిర్ టెల్ (-1.54%), మారుతి (-0.87%).

  • Loading...

More Telugu News