Vijay Deverakonda: మతి పోగొడుతున్న లైగర్ పోస్టర్.. విజయ్ దేవరకొండ ట్వీట్

Vijay Deverakonda bares it all in new Liger poster Karan Johar reacts
  • నా సర్వస్వాన్ని తీసుకున్న సినిమా ఇదంటూ కామెంట్
  • తనది ఎంతో సవాలుతో కూడిన పాత్ర అంటూ ట్వీట్
  • బోల్డ్ పాత్రలను నటులు అంగీకరించడం అరుదన్న కరణ్ జోహార్
విజయ్ దేవరకొండ విభిన్న పాత్రతో అభిమానులను మెప్పించనున్నాడు. ‘లైగర్’ సినిమాతో త్వరలోనే బాలీవుడ్ కు విజయ్ దేవరకొండ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుండడం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదలైంది. అందులో విజయ్ దేవరకొండ శరీరంపై ఏమీ లేకుండా చాలా బోల్డ్ గా కనిపిస్తున్నాడు. కేవలం గులాబీ పూల గుచ్ఛాన్ని నడుము కింది భాగంలో ఆచ్ఛాదన గా పెట్టుకున్న పోస్టర్ విడుదలైంది.

నూతన పోస్టర్ ను తన ట్విట్టర్ పేజీలో విజయ్ దేవరకొండ షేర్ చేశాడు. ‘‘నా సర్వస్వాన్ని తీసుకున్న సినిమా ఇది. పనితీరు పరంగా, మానసికంగా, శారీరకంగా ఎంతో సవాలుతో కూడిన పాత్ర నాది. త్వరలోనే లైగర్ రానుంది’’ అని విజయ్ ట్వీట్ చేశాడు. ఈ సినిమాకు రచన, దర్వకత్వం పూరీ జగన్నాథ్. సహ నిర్మాతగా కూడా ఉన్నారు. అలాగే, కరణ్ జోహార్, చర్మే కౌర్ కూడా నిర్మాతలుగా పనిచేస్తున్నారు. 

ఏక కాలంలో హిందీ, తెలుగు, తమిళ్ సహా ఐదు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. కరణ్ జోహార్ సైతం ఈ పోస్టర్ ను షేర్ చేస్తూ.. ‘‘ఈ తరహా బోల్డ్ పాత్రలను నటులు చేయడం అరుదు. విజయ్ లుక్ పీకే చిత్రంలో అమీర్ ఖాన్ వివాదాస్పద చిత్రాన్ని గుర్తుకు తెస్తోంది’’అని కరణ్ జోహార్ ట్వీట్ చేశారు. అనన్య పాండే, మైక్ టైసన్ ఈ సినిమాలో పాత్రలను పోషించారు. 

శ్రేయాస్ మీడియా సైతం ఈ సినిమా పోస్టర్ ను షేర్ చేసింది. ‘‘రక్తం, స్వేదం, గుండె, ఆత్మ.. మా సర్వస్వం మీకు అందిస్తున్నాం’’అని ట్వీట్ పెట్టింది.
Vijay Deverakonda
liger
poster
bold
Karan Johar
Puri Jagannadh

More Telugu News