Ravindra Jadeja: బర్మింగ్ హామ్ టెస్టులో సెంచరీ పూర్తి చేసుకున్న జడేజా
- ఎడ్జ్ బాస్టన్ లో టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్
- టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్
- 92 పరుగులకే 5 వికెట్లు డౌన్
- ఆదుకున్న పంత్, జడేజా
- తొలిరోజు సెంచరీ చేసిన పంత్
- రెండోరోజు ఆట ఆరంభంలోనే శతకం సాధించిన జడేజా
ఇంగ్లండ్ తో బర్మింగ్ హామ్ లో జరుగుతున్న టెస్టులో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అద్భుతంగా ఆడి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఎంతో సంయమనంతో ఆడిన జడేజా 183 బంతుల్లో 100 పరుగులు సాధించాడు. అతడి స్కోరులో 13 బౌండరీలు ఉన్నాయి. రెండో రోజు ఆట ఆరంభంలోనే జడేజా ఈ ఘనత అందుకున్నాడు.
తొలిరోజు ఆటలో సెంచరీ హీరో రిషబ్ పంత్ కు విశేషంగా సహకారం అందించిన జడేజా... కెరీర్ లో చిరస్మరణీయం అనదగ్గ శతకాన్ని లిఖించాడు. మాథ్యూ పాట్స్ బౌలింగ్ లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి సెంచరీ మార్కు అందుకున్నాడు. ప్రస్తుతం టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు 8 వికెట్లకు 371 పరుగులు. 16 పరుగులు చేసిన మహ్మద్ షమీ... బ్రాడ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో జడేజా (100 బ్యాటింగ్), టీమిండియా సారథి బుమ్రా ఉన్నారు.