Raghu Rama Krishna Raju: పీఎంవో నుంచి వచ్చిన జాబితాలో రఘురామకృష్ణరాజు పేరు లేదన్న ఏలూరు రేంజ్ డీఐజీ

Raghu Rama Krishnam Raju name not listed in modi tour says DIG
  • వేదికపై ఉండే వారి జాబితాలోనూ లేదన్న డీఐజీ పాలరాజు 
  • రఘురామ ఫోన్ నంబరును బ్లాక్ లిస్టులో పెట్టలేదని స్పష్టీకరణ
  • ప్రధాని కార్యక్రమానికి ఆయన ఎలా వస్తున్నారో తెలియదన్న డీఐజీ 
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ఏపీలో పర్యటించనున్నారు. ఆయన పర్యటనలో పాల్గొనేందుకు ఏపీ వస్తున్నట్టు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఏపీలో కాలుపెట్టే తనను అరెస్ట్ చేయకుండా చూడాలంటూ హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు కీలక ప్రకటన చేశారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన జాబితాలో కానీ, వేదికపై ఉండే వారి జాబితాలో కానీ, హెలిప్యాడ్ వద్ద ప్రధానిని ఆహ్వానించే వారి జాబితాలో కానీ రఘురామకృష్ణరాజు పేరు లేదని పేర్కొన్నారు.

ప్రధాని కార్యక్రమానికి ఆయన ఎలా వస్తున్నారో తెలియదని, తాము మాత్రం చట్ట ప్రకారమే నడుచుకుంటామని తెలిపారు. రఘురామరాజు ఫోన్ నంబరును పోలీసులు బ్లాక్ లిస్టులో పెట్టలేదని వివరించారు. కాగా, ప్రధాని పర్యటన నేపథ్యంలో ఫ్లయింగ్ ఆంక్షలు ఉన్నాయని, వాయుమార్గంలో ఎవరైనా రావాలనుకుంటే అనుమతులు తప్పనిసరని డీఐజీ స్పష్టం చేశారు.
Raghu Rama Krishna Raju
Bhimavaram
Narendra Modi

More Telugu News