Gopichand: యాక్షన్ సినిమాలు చేయాలనుంది: రాశి ఖన్నా

Rashi Khanna Interview
  • రాశిఖన్నా తాజా చిత్రం 'పక్కా కమర్షియల్' 
  • కామెడీ పరంగా దక్కిన మంచి మార్కులు  
  • డిఫరెంట్ జోనర్స్ లో చేయాలనుందంటూ వ్యాఖ్య  
టాలీవుడ్ లోని గ్లామరస్ హీరోయిన్స్ లో రాశి ఖన్నా ఒకరు. ఆమె తాజా చిత్రంగా 'పక్కా కమర్షియల్' సినిమా రూపొందింది. గోపీచంద్ - రాశి ఖన్నా జంటగా నటించిన ఈ సినిమా, ఈ నెల 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'ప్రతి రోజూ పండగే' సినిమాలో రాశి ఖన్నాతో కామెడీ చేయించిన మారుతి, ఈ సినిమాలోను ఆమెతో సందడి చేయించాడు.
 
తాజా ఇంటర్వ్యూలో రాశి ఖన్నా మాట్లాడుతూ .. "ఇంతవరకూ నేను లవ్ .. రొమాన్స్ .. కామెడీ రోల్స్ చేస్తూ వచ్చాను. మైథలాజికల్ స్టోరీస్ లోను .. యాక్షన్ సినిమాల్లోను చేయాలనుంది. ఒక ఆర్టిస్ట్ గా డిఫరెంట్ జోనర్స్ లో డిఫరెంట్ రోల్స్ చేయాలనే ఆసక్తి ఉంది. ప్రేక్షకులు ఆదరిస్తారనిపించే ప్రయోగాత్మక పాత్రలను పోషించాలని ఉంది. 

నేను చేసిన పాత్రలు ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదనిపిస్తే, ఎందుకు అలా జరిగిందనే ఒక ఆలోచన చేస్తాను. వాళ్లు రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి నన్ను నేను సరిచేసుకుంటూ ముందుకు వెళుతుంటాను. ఇంతవరకూ నేను చేసిన జర్నీ అంతా ఒకసారి చూస్తే, విమర్శలను పాఠాలుగా భావిస్తూ రావడం కనిపిస్తుంది" అంటూ చెప్పుకొచ్చింది.
Gopichand
Rashi Khanna
Maruthi
Pakka Commercial Movie

More Telugu News