Spice Jet: ఇండియా నుంచి దుబాయ్ కి బయల్దేరిన విమానం పాకిస్థాన్ లో ల్యాండ్ అయింది... కారణం ఇదే!

Spicejet plane from Delhi to Dubai landed safely in Karachi

  • ఢిల్లీ నుంచి దుబాయ్ కు బయల్దేరిన విమానం
  • ఫ్యూయల్ ఇండికేటర్ లైట్ సరిగా పనిచేయని వైనం
  • ఫ్యూయల్ లీకేజీ అనుమానాలతో విమానాన్ని ల్యాండ్ చేసిన పైలట్లు

దేశ రాజధాని ఢిల్లీ నుంచి దుబాయ్ కి బయల్దేరిన స్పైస్ జెట్ విమానం పాకిస్థాన్ లోని కరాచీలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ప్యాసింజర్లంతా సురక్షితంగా ఉన్నారని స్పైస్ జెట్ తెలిపింది. ఈ సందర్భంగా స్పైస్ జెట్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, ఫ్యూయల్ ఇండికేటర్ లైట్ సరిగా పనిచేయకపోవడంతో స్పైస్ జెట్ బీ737ను కరాచీకి మళ్లించి, ల్యాండ్ చేశామని చెప్పారు. 

'కరాచీలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్యాసింజర్లు అందరూ క్షేమంగా ఉన్నారు. ఎలాంటి ఎమర్జెన్సీని ప్రకటించలేదు. విమానం నార్మల్ గానే ల్యాండింగ్ అయింది. ఇంత వరకు ఈ విమానానికి ఎలాంటి సమస్య తలెత్తలేదు. ప్రయాణికులకు రిఫ్రెష్ మెంట్స్ అందించాం. మరో విమానాన్ని కరాచీకి పంపించాం. ఆ విమానం కరాచీ నుంచి ప్రయాణికులను తీసుకుని దుబాయ్ కి వెళ్తుంది' అని ఆయన చెప్పారు.

ఫ్యూయల్ లీకేజీ అవుతుంటే తెలియజేసే లైట్ ఇండికేటర్లు విమానంలో ఉంటాయి. ఈ ఇండికేటర్లు సరిగా పని చేయకపోవడంతో ఫ్యూయల్ లీక్ అవుతోందని పైలట్లు భావించారు. ఇంధనం నిల్వలు అసాధారణంగా తగ్గిపోతున్నట్టు వారు గుర్తించారు. దీంతో, కరాచీలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

  • Loading...

More Telugu News