Devineni Uma: నిధులు మళ్లించడం తప్ప ఈ 37 నెలల్లో ఏం చేశారు?: దేవినేని ఉమ
- పిల్లల సొమ్ములూ పీక్కున్నారు అంటూ మీడియా కథనం
- స్పందించిన దేవినేని ఉమ
- పాఠశాల కాంపోజిట్ గ్రాంట్ ఖాతాలు ఖాళీ చేశారని ఆరోపణ
- పాలనా వైఫల్యానికి నిదర్శనం అని విమర్శలు
పిల్లల సొమ్ములూ పీక్కున్నారు అంటూ మీడియాలో వచ్చిన ఓ కథనంపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమ స్పందించారు. అప్పులు చేయడం, పన్నుల బాదుడు, నిధులు మళ్లించడం తప్ప 37 నెలల్లో మీరు ఏం చేశారు? అంటూ సీఎం జగన్ ను ఆయన ప్రశ్నించారు. పాఠశాలల కాంపోజిట్ గ్రాంట్ ఖాతాలు ఖాళీ చేయడం పాలనా వైఫల్యానికి నిదర్శనం అని దేవినేని ఉమ విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల నిర్వహణ సొమ్ములు లాగేశారని ఆరోపించారు. టాయిలెట్ల నిర్వహణ పేరుతో అమ్మ ఒడిలో కోతపెట్టిన రూ.879 కోట్లూ మాయం అయ్యాయని వివరించారు..