Anand Mahindra: మీరు 'ఎన్ఆర్ఐ'నా? అన్న ప్రశ్నకు ఆనంద్ మహీంద్రా ఊహించని జవాబు

Twitter user asks Anand Mahindra is he an NRI on his Manhattan tweet he replies
  • ఈ నెల 4న మన్ హట్టన్ చిత్రాలను పోస్ట్ చేసిన పారిశ్రామికవేత్త
  • అదే రోజు అమెరికాలో స్వాతంత్య్ర దిన వేడుకలు
  • దీంతో మీరు ఎన్ఆర్ఐనా? అంటూ ఓ నెటిజన్ సందేహం
  • హచ్ఆర్ఐ అంటూ భిన్నంగా బదులిచ్చిన ఆనంద్ మహీంద్రా
పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సందర్భం వస్తే చాలు.. తన విలక్షణత చాటుకుంటారు. అటువంటి సందర్భమే ఆయనకు మరోసారి ఎదురైంది. ఆయన మన్ హట్టన్ గురించి చేసిన పోస్ట్ ల గురించి ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఊహించని విధంగా స్పందిస్తూ.. చిత్రమైన బదులిచ్చారు.

‘‘మన్ హట్టన్ జూలై 4, 2022 స్కైలైన్ ఎరప్ట్స్’’ అంటూ ఆయన కొన్ని ఫొటోలు, వీడియోను ట్విట్టర్ లో ఈ నెల 4న పోస్ట్ చేశారు. అదే రోజు అమెరికా స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంది. ఆ దృశ్యాలను వీడియోలో చూడొచ్చు. ఆకాశం బద్దలైందన్న అర్థంతో ఆయన క్యాప్షన్ పెట్టారు. అంతేకాదు, మరో ఫొటోను విడిగా మరో ట్వీట్ లో పోస్ట్ చేశారు. అందులో మనుషులు తయారు చేసిన ఏ లైట్ అయినా చంద్రుడికి సాటిరాదన్న అభిప్రాయాన్ని ఆనంద్ మహీంద్రా వ్యక్తం చేశారు. 

ఇవి చూసిన ఓ నెటిజన్ మీరు ఎన్ఆర్ఐనా? అని సందేహం వ్యక్తం చేశాడు. దీనికి ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ.. ‘‘న్యూయార్క్ లో కుటుంబాన్ని చూసేందుకు వచ్చాను. కనుక నేను హెచ్ఆర్ఐ. హార్ట్ (ఎప్పుడూ) రెసిడెంట్ ఇండియా’’ అని బదులిచ్చారు. తన హృదయంలో ఎప్పుడూ భారతే ఉంటుందన్నారు.
Anand Mahindra
twitter
NRI
HRI

More Telugu News