CM Jagan: వైసీపీ ప్లీనరీలో సీఎం జగన్ కు కూడా ఐడీ కార్డు... ఫొటో ఇదిగో!

Special ID Card for CM Jagan in YSRCP Plenary
  • నాగార్జున వర్సిటీ వద్ద వైసీపీ ప్లీనరీ
  • హాజరైన సీఎం జగన్, వైసీపీ నేతలు, కార్యకర్తలు
  • ప్లీనరీ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు
అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత వైసీపీ అత్యంత ఘనంగా పార్టీ సమావేశాలు నిర్వహించుకుంటోంది. గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ వద్ద ఏర్పాటైన వైసీపీ ప్లీనరీకి సీఎం జగన్, పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. 

కాగా, ప్లీనరీ సమావేశాలను అత్యంత క్రమశిక్షణతో నిర్వహించేందుకు వైసీపీ నేతలు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరికీ ఐడీ కార్డులు రూపొందించారు. ఆఖరికి పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు కూడా ప్రత్యేకంగా ఐడీ కార్డు డిజైన్ చేశారు. ఈ కార్డును విజయసాయి అందించగా, జగన్ చిరునవ్వుతో మెడలో వేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.
CM Jagan
ID Card
Plenary
YSRCP
Andhra Pradesh

More Telugu News