YSRCP: పాట పాడి, పాదం క‌దిపి!... ప్లీన‌రీలో మంత్రి సీదిరి సంద‌డి!

ap minister seediri appalaraju sing a song in ysrcp plenary
  • వేడుక‌గా ప్రారంభ‌మైన వైసీపీ ప్లీన‌రీ
  • వంగపండు ఉష నేతృత్వంలో సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు
  • ఉష బృందంతో క‌లిసి పాడి ఆడిన మంత్రి అప్ప‌ల‌రాజు
ఏపీలో అధికార పార్టీ వైసీపీ ప్లీన‌రీ స‌మావేశాలు గుంటూరు జిల్లా ప‌రిధిలోని ఆచార్య నాగార్జున విశ్వ‌విద్యాల‌యం స‌మీపంలో శుక్ర‌వారం వేడుక‌గా ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ స‌మావేశాల్లో భాగంగా పార్టీ శ్రేణుల‌ను ఉత్సాహ‌ప‌రిచేందుకు సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మాల్లో వంగ‌పండు ఉష హుషారెత్తించే ఉద్య‌మ గీతాల‌ను ఆల‌పించారు.

ప్లీన‌రీని పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రారంభించ‌డానికి ముందు వంగ‌పండు ఉష పాట‌లు పాడుతున్న క్ర‌మంలో ఉష బృందంతో క‌లిసి మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు సంద‌డి చేశారు. భుజంపై గొంగ‌డి వేసుకుని ఉష‌తో క‌లిసి పాట పాడిన ఆయ‌న ఆమె బృందంతో క‌లిసి కాలు కూడా క‌దిపారు. ఈ స‌న్నివేశం పార్టీ శ్రేణుల‌ను ఆక‌ట్టుకుంది.
YSRCP
Seediri Appalaraju
Plenary
Vangapandu Usha

More Telugu News