TDP: ​జగన్ ప్లీనరీ ప్రసంగంపై టీడీపీ నేతలు ఎవరేమన్నారంటే...​!

TDP leaders responds to CM Jagan remarks in YSRCP Plenary
  • ముగిసిన వైసీపీ ప్లీనరీ
  • సీఎం జగన్ ప్రసంగం
  • విపక్ష నేతలపై విమర్శనాస్త్రాలు
  • స్పందించిన టీడీపీ నేతలు
వైసీపీ ప్లీనరీలో సీఎం జగన్ వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ నేతలు స్పందించారు. స్థానిక ఎన్నికల్లో రాజ్యాంగ పదవులకు కోత వేసి బీసీలకు అన్యాయం చేశారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మాట్లాడుతూ, జగన్ తన దోపిడీ లక్షణాన్ని ఎదుటివారికి అంటగడుతున్నారని ఆరోపించారు. 

స్థానిక సంస్థల నిధులను ప్రభుత్వం కాజేయడం నిజం కాదా? అని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. రైతు సమస్యలపై వైసీపీ ప్లీనరీలో ఒక్క మాట కూడా లేదని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమ అన్నారు. మూడేళ్లలో జగన్ ఏం మేలు చేశారో చెప్పాలని నిలదీశారు.
TDP
Jagan
Plenary
YSRCP

More Telugu News