YCP Plenary: వైసీపీ ప్లీనరీకి తుపాకితో వచ్చిన గడివేముల జడ్పీటీసీ..పోలీసులు స్వాధీనం చేసుకుని ప్లీనరీ ముగిశాక అప్పగింత

YCP ZPTC RB Chandra Sekhar Reddy Came to Plenary with Gun
  • తుపాకి తీసుకుని వచ్చిన ఆర్‌బీ చంద్రశేఖర్ రెడ్డి
  • ప్రవేశ ద్వారం వద్ద పోలీసుల తనిఖీల్లో గుర్తింపు
  • మంగళగిరి రూరల్ పోలీసులకు అప్పగింత  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ప్లీనరీకి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం జడ్పీటీసీ ఆర్‌బీ చంద్రశేఖర్ రెడ్డి తుపాకితో వచ్చి కలకలం రేపారు. శుక్రవారం ప్లీనరీకి వస్తూ వెంట గన్ తెచ్చుకున్నారు. అయితే, ప్రవేశద్వారం వద్ద నిర్వహించిన తనిఖీల్లో తుపాకిని గుర్తించిన పోలీసులు దానిని స్వాధీనం చేసుకుని మంగళగిరి రూరల్ పోలీసులకు అప్పగించారు. 

తుపాకి లైసెన్స్ పత్రాలను పరిశీలించిన పోలీసులు  ప్లీనరీ అనంతరం దానిని తీసుకెళ్లాలని సూచించారు. రివాల్వర్‌ను వెంట తీసుకురావడంపై చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. తుపాకీ ఎప్పుడూ తనతోనే ఉంటుందని, కారులో విడిచిపెట్టి రావడం క్షేమం కాదన్న ఉద్దేశంతోనే వెంట తీసుకొచ్చినట్టు చెప్పారు. కాగా, నిన్న ప్లీనరీ ముగిసిన అనంతరం తుపాకిని పోలీసులు ఆయనకు అప్పగించారు.
YCP Plenary
Mangalagiri
Gun
Kurnool
RB Chandra Sekhar Reddy

More Telugu News