Rajapaksa: ఓ పర్యాటక స్థలంలా మారిపోయిన రాజపక్స నివాసం
- నిన్న కొలంబో వీధుల్లో వెల్లువెత్తిన నిరసనలు
- గొటబాయ రాజపక్స నివాసం ముట్టడి
- పారిపోయిన గొటబాయ
- అధ్యక్ష నివాస భవనాన్ని ఆక్రమించిన ఆందోళనకారులు
ప్రజాగ్రహానికి భయపడి తన ఇంటి నుంచి పారిపోయిన గొటబాయ రాజపక్స అధ్యక్ష పదవికి రాజీనామా చేయగా, అదే బాటలో ప్రధాని రణిల్ విక్రమసింఘే కూడా నడిచారు. తాజాగా, పార్లమెంటు స్పీకర్ మహీంద యాపా అభేవర్ధనే నేతృత్వంలో అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. కాగా, నిన్న వేలమంది నిరసనకారులు కొలంబో వీధుల్లో కదం తొక్కారు. గొటబాయ రాజపక్స నివాసాన్ని ముట్టడించారు. గొటబాయ అప్పటికే పారిపోగా, ఆందోళనకారులు ఆయన నివాస భవనాన్ని ఆక్రమించారు. అందులోని స్విమ్మింగ్ పూల్ లో జలకాలాడడమే కాదు, అక్కడున్న గదుల్లో హాయిగా విశ్రమించారు.
కాగా, ఇప్పుడు గొటబాయ నివాసం ఓ పర్యాటక స్థలంలా మారింది. పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ భవనం చూసేందుకు పోటెత్తుతున్నారు. చాలామంది కుటుంబ సమేతంగా వస్తుండడం విశేషం. అంతేకాదు, గొటబాయ భోజనం చేయడానికి ఉపయోగించే పెద్ద డైనింగ్ హాలులో బల్లపై వారు భోజన కార్యక్రమాలు చేపడుతున్నారు.