Payyavula Keshav: పయ్యావుల కేశవ్ భద్రతను పునరుద్ధరించాలి: అచ్చెన్నాయుడు డిమాండ్

Atchannaidu demands to provide security to Payyavula Keshav
  • కేశవ్ కు భద్రతను తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం
  • ఇందుకా మీకు ప్రజలు పట్టం కట్టిందని ప్రశ్నించిన అచ్చెన్నాయుడు
  • తామూ ఇదే మాదిరి వ్యవహరిస్తే జగన్ పాదయాత్ర చేసేవారా? అని ప్రశ్న
టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ కు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను తొలగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. పెగాసన్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో ఆధారాలతో సహా ప్రభుత్వాన్ని ఎండగడుతూ, అక్రమాలను ప్రశ్నిస్తున్నారని తమ పార్టీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు అయిన పయ్యావుల కేశవ్ గారి సెక్యూరిటీ ఉపసంహరిస్తారా? అని ప్రశ్నించారు. 

ప్రతీకార రాజకీయాలు చేయడానికా మీకు ప్రజలు పట్టం కట్టింది? అని నిలదీశారు. తక్షణమే పయ్యావుల కేశవ్ గారి భద్రతను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఇదే మాదిరిగా వ్యవహరిస్తే జగన్ రెడ్డి పాదయాత్ర చేయగలిగేవారా? అని అచ్చెన్న ప్రశ్నించారు.
Payyavula Keshav
Atchannaidu
Telugudesam
Security

More Telugu News