Dalai Lama: భార‌త సైనికుడికి సెల్యూట్ చేసిన ద‌లైలామా!... వీడియో ఇదిగో!

union minister Hardeep Singh Puri posts a video of dalai lama
  • త‌న‌కు వీడ్కోలు ప‌లుకుతున్న భార‌త సైనికుడికి షేక్ హ్యాండ్ ఇచ్చిన ద‌లైలామా
  • ద‌లైలామా చేతిని ముద్దాడిన భార‌త సైనికుడు
  • వీడియోను పోస్ట్ చేసిన కేంద్ర మంత్రి హ‌ర్‌దీప్ సింగ్ పురీ
బౌద్ధ గురువు ద‌లైలామా గొప్ప‌త‌నంతో పాటు భార‌త సైన్యం విశిష్ట‌త‌ను చాటి చెప్పేలా సోమ‌వారం జ‌రిగిన ఓ ఘ‌ట‌న‌ను బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హ‌ర్‌దీప్ సింగ్ పురీ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. 18 సెక‌న్ల నిడివి ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

బౌద్ధ మ‌త గురువు ద‌లైలామా త‌న ప‌ర్య‌ట‌న‌లో భాగంగా బ‌యలుదేరుతూ త‌న‌కు వీడ్కోలు ప‌లికేందుకు నిలుచున్న భార‌త సైనికుడొక‌రికి సెల్యూట్ చేశారు. అంతేకాకుండా త‌న‌కు సెల్యూట్ చేస్తూ నిలుచున్న ఆ భార‌త సైనికుడిని త‌న వ‌ద్ద‌కు ర‌మ్మ‌ని పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ద‌లైలామా పిలుపుతో ఆయ‌న వ‌ద్ద‌కు వెళ్లిన భార‌త సైనికుడు ఆయ‌న చేతిని ముద్దాడి... దలైలామాపై త‌న‌కున్న గౌర‌వాన్ని చాటుకున్నారు.
Dalai Lama
Indian Army
Indian Soldier
Hardeep Singh Puri
BJP

More Telugu News