Nokia: నోకియా నుంచి కొత్త ఆండ్రాయిడ్ ఫోన్... వివరాలు ఇవిగో!

New android phone G21 from Nokia

  • మళ్లీ రేసులోకి నోకియా
  • బడ్జెట్ ఫోన్ల సెగ్మెంట్లో కొత్త మోడల్ జీ21
  • ప్రారంభ ధర రూ.12,999
  • లాంగ్ లైఫ్ బ్యాటరీ సహితం

ఒకప్పుడు మొబైల్ ఫోన్ల రంగంలో నెంబర్ వన్ గా వెలిగిన నోకియా కాలక్రమంలో వెనుకబడిపోయింది. ఫీచర్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు వచ్చాక శాంసంగ్ వంటి కంపెనీల నుంచి ఎదురైన పోటీని తట్టుకోలేక మార్కెట్ పరంగా పతనం చవిచూసింది. నిదానంగా మళ్లీ రేసులోకి వచ్చిన నోకియా... హెచ్ఎండీ గ్లోబల్ ద్వారా తన ఫోన్లను మార్కెట్లోకి తీసుకువస్తోంది. 

తాజాగా నోకియా నుంచి జీ21 ఆండ్రాయిడ్ ఫోన్ రంగప్రవేశం చేసింది. ఈ ఫోన్ ను రూ.15 వేల లోపే వినియోగదారులకు అందించనున్నారు. భారత్ లో దీని ధర రూ.12,999 అని తెలుస్తోంది. ఇందులో ప్రారంభ వెర్షన్ ఫోన్ లో 4 జీబీ రామ్, 64 జీబీ స్టోరేజి సదుపాయం ఉంది. మరో వెర్షన్ 6 జీబీ రామ్, 128 జీబీ స్టోరేజి కలిగి ఉంది. దీని ధర రూ.14,999. 

ఇది నార్డిక్ బ్లూ, డస్క్ కలర్లలో లభ్యమవుతుంది. ఇందులో 50 ఎంపీ సామర్థ్యంతో ఏఐ ఇమేజింగ్ తో కూడిన ట్రిపుల్ కెమెరా పొందుపరిచారు. నోకియా జీ21లో లాంగ్ లైఫ్ బ్యాటరీ పొందుపరిచారు. సింగిల్ చార్జింగ్ తో మూడ్రోజుల పాటు పనిచేస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. 

6.5 అంగుళాల డిస్ ప్లే, హెచ్ డీ రిజల్యూషన్, గూగుల్ అసిస్టెంట్ బటన్, ఆక్టాకోర్ ప్రాసెసర్ దీని ప్రత్యేకతలు. ఇతర కంపెనీలకు దీటుగా అత్యధిక రిఫ్రెష్ రేటు కలిగివున్నట్టు తెలుస్తోంది. ఈ ఫోన్ తన సెగ్మెంట్లో రెడ్ మీ, రియల్ మీ, శాంసంగ్ ఫోన్లకు పోటీనిస్తుందని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News