Gold prices: 9 నెలల కనిష్ఠానికి బంగారం ధరలు.. ముందుముందు ఎలా ఉంటుంది?
- అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ 1,735 డాలర్లు
- దేశీయంగా ఎంసీఎక్స్ లో తులం ధర రూ.50,600
- సమీప భవిష్యత్తులో అమ్మకాల ఒత్తిడి ఉంటుందన్న అంచనా
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తొమ్మిది నెలల కనిష్ఠానికి చేరాయి. యూఎస్ డాలర్ 20 ఏళ్ల గరిష్ఠాలకు పెరగడం బంగారంతోపాటు, రూపాయిపైనా ప్రభావం చూపిస్తోంది. ఔన్స్ బంగారం (28.34 గ్రాములు) స్పాట్ ధర 1,734.97 డాలర్లకు చేరింది. 2021 సెప్టెంబర్ లో 1,722.36 డాలర్ల కనిష్ఠం తర్వాత తిరిగి అదే స్థాయికి చేరుకుంది. మన దేశీ మార్కెట్లోనూ బంగారం ధర తగ్గింది. గత వారం తులం బంగారం ధర రూ.52,300 వరకు పలకగా, అది ఇప్పుడు ఎంసీఎక్స్ లో రూ.50,600 వద్ద ఉంది.