Shivraj Singh Chouhan: సీఎంకు చల్లారిపోయిన టీ ఇచ్చారంటూ అధికారికి షోకాజ్ నోటీసులు

Show cause notice for official for serving CM cold tea
  • మధ్యప్రదేశ్ లో ఘటన
  • ఖజురహోలో పర్యటించిన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్
  • ఎయిర్ పోర్టు వద్ద కాసేపు ఆగిన సీఎం
  • నాసిరకం టీ ఇచ్చారంటూ ఆగ్రహం
  • ఓ జూనియర్ అధికారిని బాధ్యుడ్ని చేసిన వైనం
మధ్యప్రదేశ్ లో ఓ అధికారికి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు చల్లారిపోయిన టీ ఇచ్చారన్నది అతడిపై వచ్చిన ఆరోపణ. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఖజురహోలో పర్యటించిన సమయంలో ఈ ఘటన జరిగింది. 

స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం ఖజురహో వచ్చిన చౌహాన్ ఎయిర్ పోర్టు వద్ద కాసేపు ఆగారు. ఆ సమయంలో నాసిరకం టీ, పైగా చల్లారిపోయిన టీ ఇవ్వడంతో సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి రాకేశ్ కనౌహా అనే జూనియర్ పౌర సరఫరాల అధికారిని బాధ్యుడ్ని చేశారు. అతడికి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సీఎంకు అలాంటి టీ ఎందుకు అందించారో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో కోరారు.
Shivraj Singh Chouhan
Tea
Cold
Show Cause Notice
Madhya Pradesh

More Telugu News