Srisailam: ఎగువ ప్రాంతాల్లో వర్షాలు... శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు

Huge flood water arrives Srisailam Project

  • పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు
  • ఉప్పొంగుతున్న కృష్ణా నది
  • జూరాల ప్రాజెక్టు నుంచి నీరు విడుదల
  • శ్రీశైలం ప్రాజెక్టుకు 36 వేల క్యూసెక్కుల వరదనీరు

రుతుపవనాలు, అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. గత కొన్నిరోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. 

జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేయగా... 36,678 క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం 824 అడుగులకు చేరింది. శ్రీశైలం ప్రాజెక్టుకు మరో రెండుమూడు రోజుల పాటు వరద ప్రవాహం కొనసాగుతుందని నీటిపారుదల శాఖ అధికారులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News