Sri Lanka: శ్రీలంక చేరుకోవాల్సిన 120కి పైగా విమానాలు కేరళలో ల్యాండింగ్
- మాల్దీవులకు పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ
- ఎమర్జెన్సీ విధించిన ప్రధాని విక్రమసింఘే
- విమానాలు భారత్ కు మళ్లింపు
- కొచ్చి, తిరువనంతపురం ఎయిర్ పోర్టుల్లో టెక్నికల్ ల్యాండింగ్
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స మాల్దీవులకు పారిపోగా, దేశంలో అత్యయిక పరిస్థితి విధిస్తున్నట్టు ప్రధాని రణిల్ విక్రమసింఘే ప్రకటించారు. ఈ నేపథ్యంలో, శ్రీలంక చేరుకోవాల్సిన 120కి పైగా విమానాలను కేరళకు మళ్లించారు. ఈ విమానాలు కేరళలోని తిరువనంతపురం, కొచ్చి ఎయిర్ పోర్టుల్లో ల్యాండయ్యాయి.
దీనిపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా స్పందించారు. తిరువనంతపురం, కొచ్చి విమానాశ్రయాల సిబ్బందిని అభినందించారు. 120కి పైగా విమానాలను టెక్నికల్ ల్యాండింగ్ కు అనుమతించడం ద్వారా తమ విధులకు మించిన బాధ్యతలను నిర్వర్తించారని కొనియాడారు. పొరుగుదేశంతో మన సంబంధాల బలోపేతానికి ఈ చర్య ఎంతగానో దోహదపడుతుందని సింథియా అభిప్రాయపడ్డారు.